బాలికలను విద్యకు దూరం చేయడానికి విష ప్రయోగం

బాలికలను విద్యకు దూరం చేయడానికి విష ప్రయోగం

ఇరాన్ ,  ఆఫ్ఘనిస్థాన్‌ వంటి ఇస్లామిక్ దేశాల్లో  మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆయా దేశాల్లోని పాలకులు మహిళలు, బాలికల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇరాన్‌ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విషప్రయోగం  చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఇరాన్ మంత్రి యునెస్‌ పనాహీ  స్వయంగా వెల్లడించారు. గతేడాది నవంబరు చివరి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విష ప్రయోగం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు చెప్పారు. ‘ఖోమ్  పాఠశాలలో చాలా మంది బాలికలపై విషప్రయోగానికి పాల్పడుతున్నారు. బాలికల పాఠశాలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారు. కొందరు కుట్రపూరితంగానే ఇలా చేస్తున్నట్టు గుర్తించాం. విద్యా సంస్థలను ముఖ్యంగా మహిళలు చదివే పాఠశాలను మూసేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇలాంటి కేసులు వందలాదిగా నమోదయ్యాయి. బాధిత బాలికల్లో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. విషప్రయోగం కారణంగా బాలికలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రి చెప్పినట్టు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏపేర్కొంది.