కుక్కల భీభత్సం..

కుక్కల భీభత్సం..

రంగారెడ్డి ప్రతినిధి, ముద్ర : అంబర్‌పేట ఉదంతం మరువకముందే రాజేంద్రనగర్ పరిధిలో ప్రజల ఆందోళనకు కారణమైంది. రాజేంద్రనగర్ హైదర్ గూడ ఎర్రబోడ కాలనీ లో వీధి కుక్కల బీభత్సం.  వరుసగా ఐదు మంది పై దాడి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరచిన పిచ్చి కుక్క. చెయి పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లిన కుక్క. కింద పడేసి నెత్తిపై విచక్షణారహితంగా కరచి గాయ పరిచిన కుక్క అడ్డుకోవడానికి యత్నించిన మరో బాలుడి పై దాడి.  ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన స్థానికులు. వీధి కుక్కల నుండి మమ్మల్ని కాపాడాలని వేడుకుంటున్న కాలనీ వాసులు.