టి20 CUBE లెసినియొ సహకారంతో తెలంగాణలో  క్రీడాకారుల ప్రతిభ ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలి

టి20 CUBE లెసినియొ సహకారంతో తెలంగాణలో  క్రీడాకారుల ప్రతిభ ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలి
  • లేసినియో యాప్,  లేసినియో డాట్ కాంను టీం ఇండియా క్రికెటర్  ప్రజ్ఞ వోజా, మహిళా క్రికెటర్ సునీత ఆనంద్ కలిసి ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
  • విద్యార్థుల్లో క్రీడాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తుంది.

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, ఈ యాప్ ద్వారా విద్యతోపాటు  క్రీడాకారులను వెలికి తీయడమే కాకుండా క్రీడలమీద విద్యార్థులకు, కార్పోరేట్ సంస్థల్లో పనిచేస్తున్న అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నందుకు కృషిచేస్తున్న పి.అనూష రెడ్డి మరియు వాళ్ళ బృందాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అభినందించారు. శనివారం గచ్చిబౌలిలో జరిగిన ఒక కార్యక్రమం లో లేసినియో యాప్,  లేసినియో డాట్ కాంను టీం ఇండియా క్రికెటర్  ప్రజ్ఞ వోజా, మహిళా క్రికెటర్ సునీత ఆనంద్ కలిసి  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.

మాజీ క్రికెటర్ ప్రజ్ఞ వోజా మాట్లాడుతూ భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో శక్తి, యుక్తులున్న క్రీడాకారులకు బంగారు భవిత ఉందన్నారు. ఇలాంటి యాప్ లు గ్రామీణ క్రీడాకారులకు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పి. అనూష రెడ్డి మాట్లాడుతూ అందరికీ క్రీడలు, క్రీడాంశాలు అందుబాటులో   ఉండేలా ప్రయత్నం చేస్తూ T20 cube ను  లెసినియొ  సహకారంతో ప్రచారం చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ ని దేశవ్యాప్తంగా చాటుతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇఫ్లూ ప్రొఫెసర్ ఓయూ మాజీ డీన్ డాక్టర్ వెంకటరెడ్డి,ఐఐటి మద్రాస్, జేఎన్ టీయూ మాజీ డీన్  డాక్టర్ రాజేశం, ఇంగ్లాండ్ బోల్టన్ యూనివర్సిటీ మాజీ  డిప్యూటీ వైస్ ఛాన్సలర్  డాక్టర్ కొండల్ రెడ్డి , లేసినియో ముఖ్య సలహాదారుడు  సూర్య ప్రకాశ్ రెడ్డి, పుల్ల నర్మదారెడ్డి, కబడ్డీ, బాక్సింగ్, టెన్నీస్ జాతీయ క్రీడాకారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నాయకులు, విద్యావేత్త మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.