అందరికీ నాణ్యమైన విద్య అందించడమే సియం కేసిఆర్ లక్ష్యం

అందరికీ నాణ్యమైన విద్య అందించడమే సియం కేసిఆర్ లక్ష్యం

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే సియం కేసిఆర్ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని ధరూర్ క్యాంప్ ఎస్టీ బాలుర వసతి గృహం లో ప్రభుత్వం మంజూరూ చేసిన ఉలెన్ బ్లాంకెట్ లను, నోట్, పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే  విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే  విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో బాలుర వసతి గృహం రూ. 1.72 కోట్ల నిదులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, గిరిజనులు, ఆదివాసీల స్వయం పాలన ఉద్దేశం తో తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

రాష్ట్రంలో 91 గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయగా 66వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నరని అన్నారు. గిరిజన, ఆదివాసిలకు పోడు పట్టాల పంపిణీ ద్వారా భూమి పై హక్కు కల్పిస్తూ, రైతు బందు, భీమా కల్పించడం జరిగిందని, గిరిజనులకు పరిశ్రమల ఏర్పాటుకు  ప్రోత్సాహం, శిత్ల భవానీ, సంట్ సేవాలాల్, సమ్మక్క సారక్క, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ పక్షాన నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఎస్టీ హాస్టల్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, క్యాంప్ రామాలయం ఛైర్మెన్ నరేష్, కౌన్సిలర్ చాంద్ పాషా, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, వొంటిపులిరాము, కౌన్సిలర్ లు గుగ్గిల్ల హరీష్, కూతురు రాజేష్, స్టాఫ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.