రైతులతో పెట్టుకుoటే పుట్టగతులుoడవ్...

రైతులతో పెట్టుకుoటే పుట్టగతులుoడవ్...
  • నష్టపోయిన ప్రతి రైతుకు 50 వేల పరిహారం ఇవ్వాలి..
  • మల్యాల క్రాస్ రోడ్డుపై బీజేపీ ఆందోళన...

ముద్ర, మల్యాల: మల్యాల క్రాస్ రోడ్డు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలు, వడగళ్ళతో నష్టపోయిన ప్రతి రైతును తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో పెట్టుకుంటే కెసిఆర్ ప్రభుత్వానికి పుట్టగతులుoడవని ఈ సందర్బంగా బీజేపీ నాయకులు హెచ్చరించారు. దాదాపు గంటసేపు రోడ్డుపై రాస్తారోకో చేపట్టగా, పెగడపల్లి ఎస్ ఐ కుమారస్వామి, మల్యాల పోలీసులు చేరుకొని, ఆందోళన విరమిoపజేశారు. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు సుద్దాల దేవయ్య పాల్గొని, మాట్లాడారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కెసిఆర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతులను ఆదుకొని, నిబద్దత చాటుకోవాలని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు మాట్లాడుతూ అకాలవర్షాల వల్ల రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయారని, నష్టపోయిన రైతుకు 50 వేల పరిహారం అందజేయాలని అన్నారు. అనంతపరం పలు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తడిసిన ధాన్యం పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం, జనగాం రాములు, ఎంపీటీసీ రమేష్, ముదుగంటి రాజు, కొక్కెర మల్లేష్ యాదవ్, గాండ్ల శ్రీనివాస్, సోన్నాకుల శ్రీనివాస్, చక్రం గౌడ్, బండారి రాజు, తదితరులు పాల్గొన్నారు.