జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం ... 

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం ... 
  • ఆపరేషన్ చేసి మహిళ కడుపులో కాటన్ గుడ్డ మరిచిన వైద్యులు
  • 16 నెలల క్రితం ఘటన
  • కడుపు నొప్పితో స్కానింగ్ తో వెలుగులోకి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు పెరగాలి ... పెంచాలి..  వైధ్యులకు, ఆశ వర్కర్లకు, ఎఎన్ ఎంలకు, అంగన్ వాడి టీచర్లకు  మన ప్రజా ప్రతినిధుల, అధికారుల ఇచ్చిన ఆదేశం. కాని ప్రభుత్వాసుపత్రికి వచ్చి చూస్తే వైద్యుల నిర్లక్షం నిలువెత్తు కనబడుతుంది.  జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో దారుణం జరిగింది. 16 మాసాల క్రితం ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి డెలివరి చేసి కడుపులోనే కాటన్ గుడ్డ మరిచి పోయారు. కడుపు నొప్పితో బాధపడుతున్న సదర్ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసుకోక బయట పడింది. ఆపరేషన్ చేసి గుడ్డ తొలగించగా ప్రాణపాయస్థితి నుంచి బయట పడింది. 

ప్రసవం కోసం వచ్చి..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలం నమిలి కొండ గ్రామానికి చెందిన జి. నవ్యశ్రీ  2021, డిసెంబర్ 28న ప్రసవం కోసం  జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు మరుసటి రోజు 29 ఉదయం నవ్యశ్రీకి ఆపరేషన్ చేసి డెలివరి చేశారు. 2022, జనవరి 1 న డిశ్చార్జి చేయగా ఇంటికి వెళ్లి పోయారు. కొద్ది రోజుల తర్వాత కడుపులో నొప్పి ప్రారంబం అయింది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఇంకా పెరగడంతో  సాధారణ నొప్పి అని బావించి మాత్రలు వేసుకుంది. కొద్ది రోజులుగా కడుపు నొప్పి తీవ్రం కావడంతో  సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో గుడ్డ(కర్సిప్) ఉన్నట్లు గుర్తించారు.  డాక్టర్లు మరోసారి ఆపరేషను చేసి పొట్టలో ఉన్న గుడ్డను తీసివేయగా ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స పొంది ఈ నెల 14న డిశ్చార్జి అయి ఇంటికి చేరుకుంది. ఈ విషయం ఫై బాధితురాలి బంధువులు జగిత్యాల ప్రబుత్వసుపత్రికి వచ్చి వైద్యులను ప్రశ్నిచెందుకు వెళ్ళగా అందుబాటులో లేక పోవడంతో జిల్లా వైద్యఅధికారికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న  జిల్లా కలెక్టర్ ఈ సంఘటనఫై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.

నేడు విచారణ  
ఆపరేషన్ చేసిమహిళ కడుపులో కాటన్ గుడ్డ మరిచిపోయిన సంఘటనఫై ముగ్గురు వైద్యుల బృందంతో విచారణకు ఆదేశించారు. విచారణ కమిటి సభ్యులు అయిన డిఎంహెచ్ఓ శ్రీధర్, ఆసుపత్రి సూపరిండెంట్ రాములు, గైనకాలజి హెచ్ ఓ డి అరుణ, బుధవారం విచారణ చేపట్టనున్నారు. 

అసలేం జరిగింది...?
అయితే ఆరోజు నవ్యశ్రీ కి ఆపరేషన్ చేసిన వైద్యురాలు పూర్తిస్థాయి అనుభవం ఉన్న వైద్యురాలు కాదని తెలుస్తుంది. పీజీ పూర్తి చేసి శిక్షణ పొందడంలో భాగంగా సీనియర్ రేసిడెంట్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆపరేషన్ చేసే సమయంలో మహిళ స్టాఫ్ నర్స్ లేకపోవడం ఆ స్థానంలో మెయిల్ నర్స్ ఉండడం.. ఆపరేషన్ చేసే సమయంలో అక్కడ వాడిన గుడ్డలు ఎన్ని చెక్ చేసుకొని ఓపెన్ చేసిన దానికి కుట్లు వేయాల్సి ఉంటుంది. ఇది అంత కూడా మెల్ నర్సు  చెక్ చేసుకొవాలి కానీ వాడిన గుడ్డ ముక్కలు లెక్కించకుండానే కుట్లు వేసినట్టుగా తెలుస్తుంది. దాంతో మహిళ కడుపులోగుడ్డ ముక్క (కర్చిప్) మరచి పోయినట్లుగా తెలుస్తుంది.