రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం మరొకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం మరొకరికి గాయాలు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా నాగవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. నాగవరం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వేడుకలకు హాజరై తిరిగి సైకిల్ మోటార్ పై వస్తు ఇంటి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ts 08 ug 7178 నంబరు గల గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టడంతో బైక్ పై వస్తున్న  కురుమూర్తి నాయుడు(40), రజిత( 26)లు అక్కడికక్కడే మృతి చెందగా వారి క్రమ కుమార్తె తనుశ్రీ (2) తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.