గ్రూప్- IV వ్రాత పరీక్ష  కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

గ్రూప్- IV వ్రాత పరీక్ష  కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
  • పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
  •  జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్  

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో జరిగే గ్రూప్ -4 పరీక్షకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జూలై -1న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని  మరియు పరీక్ష కేంద్రాల  సమీపంలో ఉన్న  అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దుని ఎస్పీ తెలిపారు .పరీక్షా కేంద్రాల వద్ద  పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అభ్యర్థులు పరీక్షా సమయాని కంటే 2 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. షూ వేసుకుని పరీక్షా కేంద్రానికి రావద్దు. అభ్యర్థులను మెటల్ డిటెక్టివ్ ద్వార పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపించడం జరుగుతుందని తెలిపారు.