రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత...

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత...
  • ప్రమాదాల నివారణకు పోలీసులకు ప్రజలు సహకరించాలి - గొల్లపల్లి ఎస్ ఐ  నరేష్ ...


ముద్ర, గొల్లపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా సహకారం అందించి ప్రాణాలు కాపాడాలని ఎస్ ఐ ఏ నరేష్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఎస్సై తన బృందంతో రోడ్డుపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చివేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఐ  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉండలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు.