శుభ్రత గురించి ప్రజలకు చెబుతాం....మేము పాటించం

శుభ్రత గురించి ప్రజలకు చెబుతాం....మేము పాటించం
  • పండగ చేసి ప్లేట్లు తీసుడు మరచిన మున్సిపల్ అధికారులు
  • చెత్తతో నిండిపోయిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్

శుభ్రత గురించి ప్రజలకు చెబుతాం....మేము పాటించం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు మాత్రమే చెబుతాం.. మేము మాత్రం పాటించం అనే విధంగా ఉంది మున్సిపల్  అధికారుల తీరు.. తెలంగాణ దశబ్ది ఉత్సవాలలో భాగంగా గత ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలోని పెద్ద చెరువు వద్ద ఈ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మెట్‌పల్లి మున్సిపల్ అధికారులకు బాధ్యతలను అప్పగించింది. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ల పర్యవేక్షణలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించిన అధికారులు వచ్చిన అతిథులతోపాటు, ప్రజలకు భోజనాలను ఏర్పాటు చేశారు. భోజనాలు పూర్తయిన తర్వాత చెరువు కట్ట పై తిన్న ప్లేట్లు, గ్లాసులు, మిగిలిన అన్నం, కూరలు పారవేయడంతో మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు.చెత్త తో నిండి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో ఉదయం పూట పెద్ద చెరువు కట్ట పైకి వాకింగ్ వెళ్ళే వాకర్స్ దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు పట్టణ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి రూల్స్ పాటించలేదని సామాన్య ప్రజలకు జరిమానా విధించే. మున్సిపల్ కమిషనర్, ఇంచర్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ల కు చెరువు కట్ట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలియడం లేదా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.