ఎబివిపి  పాఠశాల ల బందు విజయవంతం..

ఎబివిపి  పాఠశాల ల బందు విజయవంతం..
  • స్వచ్ఛందంగా  బందు పాటించిన ప్రైవేటు విద్యాసంస్థలు...
  • ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయించిన ఏబీవీపీ నాయకులు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  పాఠశాలల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని   ఎబివిపి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బందు పిలుపు ఇవ్వగా ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూసి వేయగా ప్రభుత్వ పాఠశాలలో ఎబివిపి నాయకులు బంద్ చేయించారు.ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర సమితి సభ్యుడు రాపాక సాయి మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వ పాఠశాలలలో  మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మూసివేసిన 8624 స్కూళ్లను   తిరిగి ప్రారంభించాలని,   రాష్ట్రంలో డీఎస్సీ, ఎంఈఓ, టిచర్ పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాంలో అమ్ముతునరని,  అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నారని ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేని  పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడుతామని  హెచ్చరించారు.