ఎంపి అరవింద్ దిష్టి బొమ్మ కు అంత్యక్రియలు. 

ఎంపి అరవింద్ దిష్టి బొమ్మ కు అంత్యక్రియలు. 

పిండ ప్రదానం చేసిన పసుపు రైతులు..

మెట్‌పల్లి ముద్ర:- మండలంలోని కొండ్రీకర్ల గ్రామంలో పసుపు రైతులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టి బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  ఎంపీ అరవింద్ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ పేపర్ పై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి గెలిచిన వెంటనే ఆ హామీని తుంగలో తొక్కాడని ఆరోపించారు.

ఎంపీపీ మారు సాయి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొండ్రికర్ల  గ్రామంలోని వాగుపై బ్రిడ్జి నిర్మిస్తానన్న మాట వాస్తవమేనని కరోనా కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయని. త్వరలో  బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. కొందరు కావాలని దురుద్దేశంతో ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రధానం చేశారని. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన ఎంపి అరవింద్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన అరవింద్ కు ప్రతి గ్రామ రైతులు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మండల ప్రధాన కార్యదర్శి గడ్డం రాజారెడ్డి,మోండే రమేష్, గడ్డం నరసయ్య,కోఆప్షన్ సభ్యులు మారుతి రెడ్డి, కోరేపు మురళి,పుల్లా నారాయణ గౌడ్,బద్దం రత్నాకర్ రెడ్డి,బలగం కొరెపు మారుతి, చంద్రయ్య,హరీష్, రమేష్, బి.ఆర్.ఎస్ శ్రేణులు ఉన్నారు.