నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్... డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి...

నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్... డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి...
  • శాంతి నగర్ లో కార్డెన్ సెర్చ్..
  • పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు,4 ట్రాలీ ఆటోలు స్వాధీనం 

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డి.ఎస్.పి వంగా రవీందర్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు పట్టణంలోని శాంతినగర్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేని 90 ద్విచక్ర   వాహనాలు, 4 ట్రాలీ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. చాలా మంది యువత ఆన్ లైన్ మోసాలకు బలి అవుతున్నారని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలనీలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎవరికైనా ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారాన్ని ఇంటి యజమాని సేకరించిన తర్వాతనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో మెట్‌పల్లి,కోరుట్ల సీఐ లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, ఎస్ ఐ లు శ్యామ్ రాజ్, నవీన్ కుమార్, ఉమాసాగర్, సుదీర్ రావు, శ్వేత డెబ్బై మంది సిబ్బంది ఉన్నారు.