వర్షాల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి - ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

వర్షాల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి - ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర: బారి వర్షాలు కురుస్తున్న కారణంగా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచించారు. వర్షాలు మరో నాలుగు రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దన్నారు. వరద పారుతున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని.పారుతున్న వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. చిన్న పిల్లలు బయటకు వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు.కరెంట్ స్థంబాలు వర్షం తో తడిసి ఉంటాయని వాటిని ముట్టుకోవద్దని. వర్షంలో కరెంట్ డిపార్ట్ మెంట్ హెల్పర్ లు, లైన్ మెన్ లు జాగ్రత్తగా మరమత్తులు చేయాలని సూచించారు. పొలాలు, తోటల వద్ద పాములు, తేల్లు ఉండే అవకాశం ఉందని పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలి, వర్షం లో ఎంజాయ్ మెంట్ కోసం యువత ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.