మండల కేంద్రానికి  రాకపోకలు బంద్

మండల కేంద్రానికి  రాకపోకలు బంద్
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతుంది.దీనికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి.రాత్రంత భారీ వర్షం కురిసిన కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రానికి వాహనాలు నిలిచి పోయినాయి. మండల కేంద్రం నుండి వేములవాడ పట్టణానికి వెళ్ళే దారిలో స్తంభంపల్లి గ్రామం వద్ద గంజి వాగు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. గంజి వాగు వద్ద రోడ్డుకు ఇరువైపులా భారి గేట్లు పెట్టి, భద్రతను కల్పించారు. బోయినిపల్లి నుండి కోదురుపాక వెళ్లే రహదారిలో మండల కేంద్రానికి ఆనుకొని లో లెవెల్ బ్రిడ్జి వద్ద నీళ్లు రావడంతో వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు గాని, మండల కేంద్రానికి వచ్చే రహదారిలో లో లెవెల్ బ్రిడ్జిలను, హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించి, వాహనదారులకు, ప్రయాణికులకు అంతరాయం కలగకుండా చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుకుంటున్నారు.