వేములవాడ లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు పోటా పోటీ..

వేములవాడ లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు పోటా పోటీ..
  • బీఆర్ఎస్ లో మూడు గ్రూపులు.. మూడు కేకులు..
  • వేములవాడ లో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు చర్చనీయంశం
  • సోషల్ మీడియాలో ముగ్గురు నేతల అనుచరులు రచ్చ రచ్చ

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అధికార పార్టీ బీఆర్ఎస్  రాజకీయాలు మరోసారి చర్చనీంశంగా మారాయి. మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు పోటా పోటీగా నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ల పంచాయతీ నేపధ్యంలో ఈ సారి మూడు గ్రూపులకు చెందిన ముగ్గురు నేతలు బల ప్రదర్శన నిర్వహించుకున్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు బారి కేక్ కట్ చేసి , మొక్కలు నాటడం, అన్నధాన కార్యక్రమాలు చేపట్టగా.. బీఆర్ఎస్ టికెట్ ఆశీస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహరావు తాను వేములడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తున్న మరో నేత ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు బారి విరాళంగా ఫర్నిచర్ అప్పగించాడు. ఈ ముగ్గురు నేతల అనుచరులు సోషల్ మీడియాలో తమ పోస్టులతో రచ్చ రచ్చ చేశారు. తమ నేతకే మంత్రి కేటీఆర్ ఉన్నట్లు..పర్కోంటూ.. ఎవరికి వారు చర్చ జరిపారు. గతం లో కేటీఆర్ బర్త్ డే కు బీఆర్ఎస్ క్యాడర్ మాత్రమే కేక్ కట్ చేసి.. కార్యక్రమాలు నిర్వహించేదని, ఈ సారి మొదటిసారి ఎమ్మెల్యే రమేశ్ బాబు ఆయన అభిమానుల కోరిక మేరకు హజరయ్యారంటూ రెండవ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. మీరెన్ని చేసిన మా రమేశ్ బాబు సర్ దే వేములవాడ అడ్డ అంటూ రమేశ్ బాబు అభిమానులు వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఏనుగు మనోహర్ రెడ్డి అభిమానులు ఇదే తరహాలో విజృంభించడంతో.. వేమలవాడ రాజకీయాలు హీటెక్కాయి.

ఎవరికి వారు అధిక మొత్తం జనాన్ని కూడగట్టి బల ప్రదర్శన చేసినంత పని చేశారు. ఎప్పుడు ఎడ మోహం, పెడ మోహం వేసుకోని సిరిసిల్ల లో ఎవరికార్యక్రమాలు వారు నిర్వహించే బీఆర్ఎస్ నాయకులు కలసికట్టుగా ఈ సారి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తే వేములవాడ లో మాత్రం బీఆర్ఎస్ మూడు వర్గాలుగా వీడిపోయి... కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయంశమవుతుంది.

నేతల పోటీ తత్వం.. నాయకులకు పెరిగిన గౌరవం..

వేములవాడ నియోకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల పోటీతత్వం తో వేములవాడ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు పార్టీ పరంగా గౌరవం, విలువ పెరిగినట్లయింది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ క్యాడర్ ను పట్టించుకోని నాయకులు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లి మరి కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోన్లు చేసి వారిని మచ్చిక చేసుకోని గ్రామాల వారిగా క్యాడర్ ను పెంచుకోవల్సిన పరిస్థితి నెలకొంది. అసంతృప్తి లీడర్లను బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేములవాడ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తే తమకే మంచిగా రాజకీయ అవకాశాలు ఉన్నట్లు చెప్పుకోవడానికి విస్తృత పర్యటనలు చేస్తున్నారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ ముగ్గురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నడు లేని విధంగా ఎమ్మెల్యే రమేశ్ బాబు సైతం వేములవాడ నియోజకవర్గానికి అధిక మొత్తం సమయం వెచ్చించి..తరుచు పర్యటనలు.. ప్రభుత్వ కార్యాలయాల విజిట్స్.. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన వంటివి చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్దిని కూడా సోషల్ మీడియా ద్వారి ఫోకస్ చేసేందుకు తన వంతుగా ప్రయత్నం ప్రారంభించారు.  ఏది ఏమైన వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాలు కేటీఆర్ బర్త్ డే వేడుకల సందర్బంగా మరోసారి చర్చకు రావడం గమనర్హం.