పీరీల ఉత్సవాలకు 5వేల ఆర్థిక సహాయం - సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

పీరీల ఉత్సవాలకు 5వేల ఆర్థిక సహాయం - సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

ముద్ర, ఎల్లారెడ్దిపేట : పీరిలా ఉత్సవాల నిర్వహణకు 5 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు.  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈనెల 29న ముస్లిం సోదరులు నిర్వహించే పీరీల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహాయంగా 5వేల నగదును రఫిక్, రియాజ్  లకు అందజేశారు.