రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీజేపి గ్రాఫ్ డౌన్ ఫాల్

రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీజేపి గ్రాఫ్ డౌన్ ఫాల్
  • అతిగతి లేని కార్యక్రమాలు.. అవే గ్రూపు రాజకీయాలు
  • జిల్లా అధ్యక్షులు సిరిసిల్లకు రాడు.. సిరిసిల్ల నేతలు మారరు
  • ధర్నా, రాస్తారోకోలకు బీజేపి శ్రేణులు 20 మంది మించుతలేరు
  • సిరిసిల్ల ప్రచారక్ రాణిరుద్రమ హైదరాబాద్ కే పరిమితం
  • సిరిసిల్ల లో ఆఘమవుతున్న బీజేపి క్యాడర్
  • బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ముందుకు.. బీజేపి వెనక్కి..
  • బండి సంజయ్ మార్పుతో సిరిసిల్ల లో అనుహ్య మార్పులు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీజేపి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్పు తర్వాత రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీజేపి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రాప్ డౌన్ఫాల్ అవుతుంది. సిరిసిల్ల జిల్లా లో బీజేపి గ్రూపు రాజకీయాలు వెంటాడుతున్నాయి. ఒకరు కార్యక్రమం నిర్వహిస్తే మరోకరు హజరుకావడం లేదు. నిన్న మొన్నటి దాకా బీజేపిలో యాక్టీవ్గా తిరిగిన నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు. సిరిసిల్ల నాయకత్వ లోపం కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది. సిరిసిల్ల జిల్లా లో ప్రచారం లేకుండానే.. ఎంపి ఎన్నికల్లో బండి సంజయ్కు అత్యధిక ఓట్లు పడటమే కాకుండా.. అనుహ్యా రీతిలో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముగ్గురు కౌన్సిలర్లు విజయం సాధించి సంచలనం సృష్టించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఐదు నెలల క్రితం వరకు స్ట్రాంగ్ గా ఉన్న బీజేపి కార్యకలాపాలు, కార్యక్రమాలు నిర్వీర్యం అయ్యాయి. శుక్రవారం బీజేపి రాష్ట్ర అధినాకత్వం పిలుపు మేరకు సిరిసిల్ల చేసిన ధర్నా..రాస్తారోకో కార్యక్రమానికి పట్టుమని పది మంది కూడా బీజేపి శ్రేణులు హజరుకాలేదు. రాస్తారోకో ప్రారంభం ఐన తర్వాత కాసేపట్టి సంఖ్య 25కు నిండింది. ప్రస్తుతం సిరిసిల్ల ఉన్న నాయత్వాన్ని కూడా బీజేపి అధిష్టానం ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

పార్టీకి ఇంచార్జీ ఎవరో.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలియని అయోమయ పరిస్థితిలో గ్రూపు రాజకీయాల్లో బీజేపి కార్యకర్తలు ఎవరితో తిరగాలో.. ఎవరికి పని చేయాలో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. కనీసం బీజేపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సైతం సిరిసిల్ల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపిలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను తొలగించేందుకు.. అందరిని కలిపేందుకు కూడా కృషి చేయడం లేదని సిరిసిల్ల  బీజేపి శ్రేణుల్లో చర్చ కొనసాగుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బీజేపి నాయకుల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లగిశెట్టి శ్రీనివాస్ బీజేపి తీర్థం పుచ్చుకోని ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

స్థానిక నాయకత్వం లగిశెట్టి శ్రీనివాస్కు సీనియర్లు ఎవరు సహకరించడం లేదని తెలిసింది. బీజేపిలో సీనియర్ లీడర్లు రెడ్డబోయిన గోపి, ఆవునూరి రమాకాంతరావు, ఆడెపు రవీందర్, కటకం మృత్యుంజయంలు కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నట్లు సమాచారం. సిరిసిల్ల పట్టణంలో బీజేపిలో యాక్టీవ్ లీడర్ గా ఉన్న బీజేపి పట్టణ మాజీ అధ్యక్షులు అన్నల్ధాస్ వేణు ప్రస్తుతం బీజేపికి అంటిముట్టనట్లుగా..ఉంటూ.. మేజార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. సిరిసిల్ల బీజేపి నాయకులతో నెలకొన్న విబేధాలతోనే అన్నల్దాస్ వేణు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే బీజేపిలో ఐదు గ్రూపులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రెడ్డబోయిన గోపీ, లగిశెట్టి శ్రీనివాస్, అన్నల్దాస్ వేణు, గౌడ వాసు, ఆవునూరి రమకాంతరావు లు బీజేపిలో అధిపత్యం కోసం ఎవరి వర్గాన్ని వారు కొనసాగిస్తున్నటల్లు రాజకీయ చర్చ కొనసాగుతుంది.

బీఆర్ఎస్ పోటీగా ఉన్న బీజేపి గ్రాఫ్ డౌన్ ఫాల్ కావడంతో కాంగ్రెస్ సిరిసిల్ల లో పుంజుకుంది. సిరిసిల్ల ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ప్రతి రోజు నియోజకవర్గం తిరుగుతూ.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉనికిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైన బీజేపి అధినాయకత్వం సిరిసిల్ల బీజేపిపై దృష్టి సారించి.. గ్రూపు రాజకీయాలను తొలగించాలని బీజేపి కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులను ముందస్తుగా ప్రకటిస్తే గ్రౌండ్ వర్క్ చేసుకుంటారని పేర్కొంటున్నారు. అధిష్టానం తీరుతోనే జిల్లాల్లో బీజేపి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడుతున్నాయని పేర్కొంటున్నారు.