సంక్రాంతి పండుగకు తీర్థయాత్రలకు వెళ్తున్నారా?

సంక్రాంతి పండుగకు తీర్థయాత్రలకు వెళ్తున్నారా?
be ware of Sankranti pilgrimage
  • అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  •  సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్

ముద్ర, రాజన్నసిరిసిల్ల బ్యూరో: సంక్రాంతి పండగకు తీర్ధయాత్రకు వెళితే.. దొంగతనాలు నివారించేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ కోరారు. కొన్ని సూచనలు చేశారు.సంక్రాంతి పండగకి ప్రజలు బంధువుల ఇంటికి, తీర్థయాత్రలకు వెళ్తే  ఇంటి దగ్గర నమ్మకంగా ఉన్నవారికి గాని స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని చెప్పినట్లైతే ఆ ఏరియాలో నైట్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుందన్నారు.

అలాగే ఇంట్లో ఎలాంటి నగదు గాని విలువైన బంగారు ఆభరణాలు గాని విలువైన ఏ వస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మీ వెంట అయిన తీసుకెళ్లాలి లేదా బ్యాంక్ లాకర్లో అయిన పెట్టుకోవాలి..ఇంటికి వేసే తాళాలు  చిన్న సైజ్ కాకుండా పెద్ద సైజ్ ఉండే తళాలను వేసుకోవాలని పేర్కొన్నారు.ఇంటికి వేసిన తాళం కనపడకుండ డోర్ పరదాలు అడ్డు ఉండేలా చూసుకోవాలి ఇంటికి తాళం వేసి వెళ్ళినట్లయితే కచ్చితంగా ఇంటి బయట మరియు లోపల ఒక లైట్ ఆన్ లో వేసి ఉంచగలరన్నారు.

ఇంటి మెయిన్ గేట్ కి బయటవైపు తాళం కనబడే విధంగా వేయరాదు.ఎవరైనా కాలనీల్లోకి చీరలు, ఉల్లిగడ్డలు,కూరగాయలు, ఇనుపసామాన్లు, వెంట్రుకలు సామాను, వివిధ రకాల వస్తువులు అమ్మడానికి గాని కొనడానికి గాని వచ్చే వారిని గమనిస్తూ ఉండాలన్నారు.  ఏ చిన్న అనుమానం వచ్చిన డైల్ 100 కి గాని సిరిసిల్ల రూరల్ సీఐకి గాని,ఇల్లంతకుంట, ముస్తాబాద్,తంగళ్ళపల్లి ఎస్సైలకు సమాచారం అందించాలని వివరాలకు సిరిసిల్ల రూరల్ సీఐ ఫోన్ నంబర్: 8712656369 సంప్రదించాలని ప్రజలను కోరారు.