బీఆర్‌ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి ..
ముద్ర,తెలంగాణ:-లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 80 ఏళ్ల బీఆర్ఎస్ కార్యకర్త తుక్కన్న బీఆర్‌ఎస్ ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తంచేశాడు. తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. తుక్కన్న 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఉద్యమ సమయంలో మండలవ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. నిన్న రాత్రి ఎంపీ ఎన్నికల ఫలితాలను టీవీల్లో చూసి బీఆర్ఎస్ పార్టీ ఓటమి జీర్ణించుకోలేక బెంగపెట్టుకున్నాడు. కలత చెంది మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.