తడి పొడి హానికరమైన చెత్త ను వేరు చేసి వాహనాలకు అందివ్వాలి

తడి పొడి హానికరమైన చెత్త ను వేరు చేసి వాహనాలకు అందివ్వాలి

మెట్‌పల్లి ముద్ర: ప్రజలు తడి పొడి హానికరమైన చెత్త ను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని. ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ కోరారు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం పై పట్టణంలోని 14వ వార్డులో కౌన్సిలర్ మఱ్ఱి పోచయ్య  ఆధ్వర్యంలో ప్రజలకు మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించారు. తడి పొడి హానికరమైన చెత్తను ఇంటిలోనే వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఆర్ ఓ ఉమా, ముజీబ్, రాజేందర్, నరేష్ మెప్మా సీఈఓ గంగరాణి, ఆర్ పి లు  ప్రజలు పాల్గొన్నారు