కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి- కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు

కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి- కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు

మెట్‌పల్లి ముద్ర: వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు మాజీ ధర్మపురి దేవస్థాన కమిటీ చైర్మన్ జువ్వాడి కృష్ణ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రైతులు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపి. ధర్నా నిర్వహించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని 43 కిలోలకు తూకం వేయడమే కాకుండా. తప్పతాలు పేరుతో అదనంగా 2 నుండి 3కిలోల చొప్పున తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని. రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిసిసి నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి, మామిడి నారాయణ రెడ్డి, కంది బుచ్చి రెడ్డి,కొత్త పల్లి రాజా రెడ్డి, చింతల పల్లి రాజేశ్వర్ రెడ్డి,ఏలేటి నరేందర్ రెడ్డి,గడ్డం భూమ రెడ్డి, అల్లూరి సురేందర్ రెడ్డి,తుమ్మల లింగా రెడ్డి,అందె మారుతి బాపూజీ,కొత్త పల్లి రాజేందర్,ఇల్లెందుల రాజు,ఏలేటి మహిపాల్ రెడ్డి,జెట్టి లక్ష్మణ్, వోటారికారి ప్రశాంత్, ముహమ్మద్ నసీర్ లు పాల్గొన్నారు...