రాళ్లు, మట్టి తేలిన బాటల్లో బతుకుకు గ్యారంటీ లేదు

రాళ్లు, మట్టి తేలిన బాటల్లో బతుకుకు గ్యారంటీ లేదు

ముద్ర ప్రతినిధి, వనపర్తి: చదువుతో పాటు తమకు ఇష్టమైన క్రీడల్లో శ్రద్దపెట్టి ఆడితే తన జీవితాన్నే మార్చేస్తాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మే,22 నుండి 24 వరకు  వనపర్తి జిల్లా బాల కిష్టయ్య క్రీడా మైదానంలో జరుగుచున్న   సి.యం. కప్ జిల్లాస్థాయి క్రీడల పోటీలను మంత్రి ప్రారంభించారు. సోమవారం  జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షిత క్రిష్ణ మూర్తితో కలిసి రిలే టార్చ్ ర్యాలి  నిర్వహించి బెలూన్లు వదలటంతో జిల్లాస్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తుందన్నారు.  తనకు ఇష్టమైన క్రీడను ఎంచుకొని శ్రద్ధ పెట్టి  ఆడితే  మంచి జీవితాన్ని ఇస్తుందని తెలిపారు. మనసు చంచలత్వంతో కాకుండా స్థిరంగా ఉండేందుకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు.  గెలిచిన వారు సంబరాలు చేసుకొని ఓడిపోయిన వారితో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు.  అవతలి క్రీడాకారుల గొప్పతనాన్ని గుర్తించి గౌరవించాలన్నారు. దానినే క్రీడా స్ఫూర్తి అంటారని తెలిపారు. ఒకప్పుడు  వెస్టిండీస్ బౌలర్లు ఎంతో భంకరమైన బౌలర్లు అయినప్పటికినీ సునీల్ గవాస్కర్ పట్టుదలను అతని ఆట గొప్పతనాన్ని గుర్తించి సునీల్ గవాస్కర్ ను మెచ్చుకునేదని ఉదహరించారు. వనపర్తి జిల్లాలో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో జనాభా 1.5 లక్షలు దాటే అవకాశం ఉందన్నారు. జిల్లాకు మెడికల్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నందున ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి విద్యార్థులు వస్తారని అందుకు అనుగుణంగా జిల్లాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.  అన్ని రకాల క్రీడలను ప్రాథమిక స్థాయి నుండి ఆడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎదిగే విధంగా సకల సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ జిల్లా నుండి జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడం జరిగిందన్నారు. వాలీబాల్ నుండి యశ్వంత్, సేపక్ తక్రా క్రీడ నుండి రాళ్ల నవత  వనపర్తి జిల్లా వాసులే అని గుర్తు చేశారు. జిల్లాస్థాయి సి.యం కప్ కు 14 మండలాల నుండి  వచ్చిన క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే సి.యం. కప్ క్రీడలకు 14 మండలాల నుండి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  వాలీబాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఖో ఖో , బాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి అంశాల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

జిల్లా ఎస్పీ రక్షిత క్రిష్ణ మూర్తి మాట్లాడుతూ మండల స్థాయిలో గెలిచి జిల్లా స్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారులు అందరికి అభినందనలు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు ప్రాధాన్యం కాదని క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమైనది అన్నారు. చదువుతో పాటు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తే తన జీవితమే మారిపోతుందని తెలిపారు. క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి.ఎఫ్. ఒ నవీన్ రెడ్డి, ఎ .ఎస్పీ ఆనంద్ రెడ్డి,  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వి. శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, జిల్లా గ్రంధాలయ  ఛైర్మన్ లక్ష్మయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, ఆర్డీవో పద్మావతి, అందరూ జిల్లా అధికారులు, జడ్పీటిసి లు, ఎంపిపి లు, వార్డు కౌన్సిలర్లు పి. ఈ .టి.లు, క్రీడాకారులు పాల్గొన్నారు.