రైతులకు కేసీఆర్ ఇచ్చిన మద్దతుతో.....

రైతులకు కేసీఆర్ ఇచ్చిన మద్దతుతో.....

దేశం మొత్తం తెలంగాణ రైతులవైపే చూస్తుంది
 వనపర్తి టిఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : ఒకటే సారి ఎమ్మెల్యే గా గెలిచిన ముఖ్యమంత్రి కేసిఆర్ దేశానికి అన్నం పెట్టె రైతన్న ల శాఖ వ్యవసాయ శాఖ మంత్రి చేయడం జరిగింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా వ్యవసాయరంగం ను అభివృద్ధి చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి టిఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాలను కట్టడానికి 40 ఏండ్లు పట్టిందిఅని, రెండు సంవత్సరాలలో ఏదుల రిజర్వాయర్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు.  జూరాలలో ఎన్ని నీళ్లు ఆగుతాయో అన్ని నీళ్లు ఎదుల రిజర్వాయర్ లో ఆగుతాయి అన్నారు. వనపర్తి ని జిల్లా చేయడం వల్ల జిల్లా అధికారులు అందరు అందుబాటులోకి రావడంతో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో 3 మెడికల్ కళాశాలలు ఉండేవి అని, తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 33 మెడికల్ కళాశాలలు, ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాట్లు చేసుకుని నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నాను రేపటి తరం పిల్లలకు ఉపయోగ పడుతున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది అని అన్నారు.

 అన్ని రాష్టంలో వాల్మీకి బోయలను ఎస్టీలుగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీసీలలో చేర్చి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాతనే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా లో చేర్చాలని చెల్లప్ప కమిషన్ వేసి అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. వాల్మీకి పక్షాన నిలబడుతున్నదే తెలంగాణ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజిలను, ప్రధాన రహదారి, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. సిఎం సహాయ నిధి, ఎల్ఓసి లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను స్థానిక నాయకులతో పంపించలేదు, అందరిని ఇంటికి పిలిపించి నాకు ఉన్నంతలో అందరికి అన్నం పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది కావాలని కులాలను రెచ్చగొడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు కలిస్తేనే ప్రభుత్వం. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అన్ని వర్గాల అభివృద్ధి దిశగా పని చేస్తుంది. 

ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. పింఛన్లు ఇప్పటి వరకు ఆసరా, వితంతువు, దివ్యాంగులకు ఇస్తున్నారు ఇక మీదట సౌభాగ్య లక్ష్మి పథకంను, పేదలకు గృహలక్ష్మి పథకం, గ్యాస్ సీలిండర్ రూ 400 లకు ఇవ్వడం జరుగుతుంది. జరిగిన పనులు అన్ని ప్రజల కండ్ల ముందు పెట్టాను. అభివృద్ధి జరిగింది అని అనిపిస్తే భారీ మెజారిటీతో గెలిపించాలి కారు గుర్తుకు ఓటు వేసి తెలంగాణ సర్కార్ నిలబెట్టాలి. అనుక్షణం పని చేసే నన్ను ఆదరించి గెలిపించండి . ఈ గెలుపు నా ఒక్కడి గెలుపు కాదు వనపర్తి నియోజకవర్గ ప్రజల గెలుపు అన్నారు. 2వ నెంబర్ బటన్ మీద నొక్కి ఓటు వేసి రెండో సారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ తో గెలిపించండి అని కోరారు. మంత్రి వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి, జెడ్పిటీసి మందపాయ్ కోటేశ్వర్ రెడ్డి, ఎంపిపి సంధ్య తిరుపతయ్య, పాల్గొన్నారు.