నేడు భారత్ Vs ఆస్ట్రేలియా కీల‌క పోరు..

నేడు భారత్ Vs ఆస్ట్రేలియా కీల‌క పోరు..

ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా (సోమ‌వారం) జరిగే చివరి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా గ్రూప్-1 టాపర్‌గా సెమీఫైనల్లోకి అడుగుపెడుతోంది. ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉన్నా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. కీలక నాకౌట్స్ ముందు ఆస్ట్రేలియా పై విజయం సాధించి సగర్వంగా టోర్నీలో ముందుడుగు వేయాలని భారత్‌ భావిస్తోంది.

వ్యూహాత్మక మార్పు..

ఈ క్రమంలోనే టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారి తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్-8లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా అదే కాంబినేషన్‌ను కొనసాగిస్తోంది. చివరి మ్యాచ్‌కు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.

అయితే సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన రవీంద్ర జడేజాపై వేటు వేసి ఎక్స్ ట్రా బ్యాటర్ లేదా ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది.

జడేజా ఔట్..

ఓవర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగడం ఉత్తమం. ఇలా ఆలోచిస్తే జడేజా స్థానంలో యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను ఓపెనర్‌గా ఆడితే కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం సిరాజ్ తుది జట్టులోకి వస్తాడు. ఇదొక్కటి మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో అతని ప్లేస్‌కు డోకా లేదు.

భారత తుది జట్టు(అంచనా) vs ఆస్ట్రేలియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్