ఆస్ర్టేలియా కెప్టెన్​ప్యాట్​ కమ్మింగ్స్​కు మాతృ వియోగం.. ఏసీసీ, బీసీసీఐల సంతాపం

ఆస్ర్టేలియా కెప్టెన్​ప్యాట్​ కమ్మింగ్స్​కు మాతృ వియోగం.. ఏసీసీ, బీసీసీఐల సంతాపం

న్యూఢిల్లీ: ఆస్ర్టేలియా కెప్టెన్​ ప్యాట్​ కమ్మింగ్స్​కు మాతృ వియోగం కలిగింది. భారత్​తో మూడో టెస్టు ఆడుతుండడానికి ముందే ట్వీట్టర్​ ద్వారా కమ్మింగ్స్​తన తల్లి అనారోగ్య విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మూడో టెస్టులో పాల్గొనలేనని వస్తానో రానో? తెలియదని అన్నాడు. ప్యాట్​ కమ్మింగ్స్​ తల్లి మరియా కమ్మింగ్స్​గత కొన్నేళ్లుగా క్యాన్సర్​తో బాధపడుతున్నారు. గత కొన్నిరోజులుగా ఈమె ఐసీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 
కమిన్స్​ తల్లి మృతి కారణంగా ఆస్ర్టేలియా క్రీడాకారులు నాలుగో టెస్టులో ఆమె మృతికి సంతాపంగా నలుపు బ్యాండ్​లను ధరించి ఆట కొనసాగించారు. కమ్మింగ్స్​ తల్లి మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ఆస్ర్టేలియా క్రికెట్​బోర్డు పేర్కొంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. దు:ఖ సమయంలో ప్యాట్​ కమ్మింగ్స్​ధైర్యంగా ఉండాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు మనోబలాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది.