ఏజ్​ పెరుగుతున్నా...క్రేజ్​ తగ్గని నాయికలు | Top heroines in Tollywood

ఏజ్​ పెరుగుతున్నా...క్రేజ్​ తగ్గని నాయికలు | Top heroines in Tollywood

సినిమా ప్రపంచం అంటే... ఇదొక రంగుల ప్రపంచం. ఇక్కడ ఏదన్నా దీపం ఉన్నంతవరకు ఇల్లు సదురుకోవాలి అన్నట్లు అవకాశాలు ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళ హవా.. ఆ తరువాత సదురుకుని వెళ్ళిపోవడమే... ఇక హీరోయిన్‌ విషయానికి వస్తే సినిమా రంగంలో హీరోయిన్‌ లైఫ్‌ టైమ్‌ చాలా తక్కువనే చెప్పాలి. ఒక రెండు సినిమాలు ఫ్లాప్​ అయితే చాలు. మళ్లీ హిట్​ కొడితే గానీ టాప్​ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో ఆమెకు నటించే అవకాశం దొరకదు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్​ మారినట్టే కనిపిస్తోంది. భామల కెరీర్​పై పరాజయాల ప్రభావం అసలు కనిపించడం లేదు. నటించిన సినిమాలు వరుస ఫ్లాప్​లు అవుతున్నా కొందరు హీరోయిన్లకు పిలిచి అవకాశాలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

హీరోయిన్‌ విషయానికొస్తే రెండు ఫట్లు వస్తే ఏకంగా ఫేట్‌ మారిపోతుంది. ఫ్లాప్‌ కథానాయిక అనే ముద్ర పడిపోతుంది. మళ్లీ హిట్టు కొడితేగానీ టాప్‌ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం దొరకదు. అలా కనుమరుగైన కథానాయికలు చాలామందే. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండు మారినట్టే కనిపిస్తోంది. వాళ్ల కెరీర్‌పై పరాజయాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్‌లు మూటగట్టుకున్నా.. పిలిచి అవకాశాలిస్తున్నారు. ఎందుకిలా? అంటే 'కథానాయికల కొరత' అన్నది సమాధానం. ఇక సీనియర్‌ భామలైతే వాళ్లకున్న అనుభవం, క్రేజ్‌తో కొత్త ప్రాజెక్టులు కొల్లగొడుతున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, రాశీఖన్నా తదితర కథానాయికలు ఈమధ్య తెలుగులో చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయినా సరే, క్రమం తప్పకుండా అవకాశాల్ని అందుకుంటూనే ఉన్నారు. 'ఉప్పెన'తో ఆకట్టుకున్న కృతిశెట్టికి తర్వాత ఆ స్థాయి విజయమే దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా ఉంది. ఇక సాయిపల్లవి సినిమా ఒప్పుకొంటే చాలన్నట్టుగా ఎదురు చూస్తుంటారు దర్శకనిర్మాతలు. ఆమెకి అంత క్రేజ్‌.

రాశీఖన్నాని పరాజయాలు పలకరిస్తున్నకొద్దీ ఆమె తన కెరీర్‌ని మరింతగా పరుగులు పెట్టిస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలపై దృష్టిపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌కి కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయం లేకపోయినా, అవకాశాల్ని అందుకుని 'కార్తికేయ2'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 

'ఓ బేబీ' తర్వాత తెలుగులో సమంతకి చెప్పుకోదగ్గర సినిమా లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ, 'పుష్ప'తో వచ్చిన ప్రత్యేక గీతం అవకాశం తర్వాత మళ్లీ జోరు చూపించడం మొదలుపెట్టింది. 'శాకుంతలం' సినిమాని పూర్తి చేసిన ఆమె 'ఖుషి'లో నటిస్తోంది. మరికొన్నింటిలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.

అనుష్క తొలినాళ్లల్లో అందంపైనే దృష్టిపెట్టినా, 'అరుంధతి'తో ఆమె తనలోని మరో కోణాన్ని చూపించింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా నటనకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ వస్తోంది. 'బాహుబలి' చిత్రాల తర్వాత ఆమె కెరీర్‌లో వేగం తగ్గినప్పటికీ, 'నిశ్శబ్దం' వంటి పరాజయం ఎదురైనప్పటికీ ఆమెకి కథలు వినిపించేందుకు దర్శకనిర్మాతలు వరుస కట్టారు. అయినా ఆచితూచి ముందడుగు వేస్తోంది.