బంగ్లాను బాదేసిన ఇంగ్లాండ్​

బంగ్లాను బాదేసిన ఇంగ్లాండ్​
  • 137 పరుగులతో భారీ విజయం
  • 140 పరుగులతో బౌలర్లకు చుక్కలు చూపిన డేవిడ్​ మలాన్

​ధర్మశాల: ఐసీసీ వరల్డ్​ కప్​ ఇంగ్లాండ్​ – బంగ్లాదేశ్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​ 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​పై విక్టరీ సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన బంగ్లాదేశ్​ తొలుత ఫీల్డింగ్​ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్​ బ్యాటింగ్​కు దిగింది. జానీ బారిస్టో (52), డేవిడ్​ మలాన్​ 107 పరుగుల్లోనే 16 ఫోర్లు, 5 సిక్స్​లతో విజృంభిస్తూ (140) పరుగులు, జో రూట్​ 82, జాస్​ బట్లర్​ (కెప్టెన్​) 20, హ్యారీ బ్రూక్​ (20), లీయామ్​ లైవింగ్​స్టోన్​ (0), సామ్​ కుర్రన్​ (11), వోక్స్​ (14), ఆదిల్​ (11), మార్క్​ వుడ్​ (6) నాటౌట్​, టోఫ్లే (1) నాటౌట్​. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు సాధించి బంగ్లాకు భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక బౌలింగ్​ విషయానికి వస్తే బంగ్లాదేశ్​ బౌలర్​ మహదీ హసన్​ (4) వికెట్లు, ఇస్లామ్​ (3), అల్​ అసన్​ (1), అహ్మాద్​ (1) వికెట్లు సాధించారు. 

365 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్​ ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​ లిట్టన్​ దాస్​ 76 పరుగులతో నిలదొక్కుకోగా, అతనికి సరసన ఎవ్వరూ నిల్చోలేకపోయారు. టాన్జిద్​ హసన్​ (1), శాంటో (0), షకీమ్​ (1), మీరాజ్​ (8) వరుసగా వికెట్లు కోల్పోయారు. అనంతరం వచ్చిన రహిమ్​ (51) పరుగులు సాధించి పరవాలేదనిపించాడు. తౌహీద్​ (39), మెహదీ హసన్​ (14), టాస్కిన్​ అహ్మద్​ (15), ఇస్లామ్​ (12), రెహ్మాన్​ (3) పరుగులు సాధించారు. 48.2 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించి 137 పరుగులతో ఓటమిని చవిచూశారు. ఇక బౌలింగ్​ విషయానికి వస్తే ఇంగ్లాండ్​ బౌలర్లు టోఫ్లే (4), వోక్స్​ (2), కుర్రేన్​ (1), వుడ్​ (1), రషీద్​ (1), లియామ్​ (1) వికెట్లు సాధించారు. ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా 140 పరుగులు సాధించి డేవిడ్​ మలాన్​ ఎంపికయ్యాడు. పాయింట్స్​ టేబుల్​లో ఇంగ్లాండ్​ 2 పాయింట్లతో ఉండగా, బంగ్లా 0 పాయింట్లతో వెనుకబడింది.