పట్టు బిగించిన ‘కంగారూ’

పట్టు బిగించిన ‘కంగారూ’
  • భారత్​– ఆస్ర్టేలియా 
  • ఖవాజా, గ్రీన్ అత్యధిక పరుగుల రికార్డు
  • ఆస్ర్టేలియా 480 పరుగులు

న్యూఢిల్లీ: ఆస్ర్టేలియా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్​ రెండో రోజు ఆటలో భారీ స్కోరు సాధించింది. మొదటి, రెండో రోజు ఆటతో కలిపి 480 పరుగులు సాధించింది. 167 ఓవర్లలో ఆస్ర్టేలియా పది వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆట ముగుస్తుందనగా ఆటౌట్​ అయింది. 


వికెట్ల పరంగా రవిచంద్రన్​ అశ్విన్​ ఒక్కడే ఆరు వికెట్లు తీయగా, మహ్మాద్​ షమీ రెండు, రవీంద్ర జడేజా 1, అక్షర్​ పటేల్​ 1 వికెట్లు సాధించారు. రెండో రోజు సమయం ముగుస్తుందనగా బ్యాటింగ్​కు దిగిన భారత్​ 10 ఓవర్లలో 36 పరుగులు సాధించింది. కెప్టెన్​ రోహిత్​ శర్మ 17, శుభ్​మన్​ గిల్​ 18 పరుగులతో ఆడుతున్నారు. 


బోర్డర్ గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ ఐదో వికెట్‌కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో గ్రీన్ టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. డ్రింక్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు సాధించింది. 


 అహ్మదాబాద్ టెస్టులో తొలి రోజు హవా కొనసాగించిన ఆస్ట్రేలియా.. రెండో రోజు సైతం అదే తరహా ఆట తీరు కనబరిచింది. 4 వికెట్ల నష్టానికి 255 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ (114) భారీ స్కోరు దిశగా నడిపారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 208 పరుగులు జోడించారు. శుక్రవారం లంచ్ విరామం తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పర్యాటక జట్టు 378 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.


కామెరాన్ గ్రీన్‌కు ఇదే తొలి భారత టెస్టు పర్యటన కాగా.. లాంగ్ ఫార్మాట్​లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 2013 నుంచి భారత గడ్డ మీద 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో జోడీగా ఖవాజా -గ్రీన్ రికార్డ్ క్రియేట్ చేశారు. 2021లో చెన్నై టెస్టులో సిబ్లీ-రూట్ జోడీ 200 పరుగుల పార్ట్నర్‌షిప్ నెలకొల్పింది. భారత గడ్డ మీద రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆసీస్ జోడీగానూ ఖవాజా, గ్రీన్ రికార్డ్ నెలకొల్పారు. 1979–-80లో హ్యూజెస్-–అలెన్ బోర్డర్ నెలకొల్పిన 222 పరుగులే ఇప్పటి వరకూ అత్యధికం.


కామెరాన్ గ్రీన్‌ను ఔట్ చేసిన ఓవర్లోనే అలెక్స్ కేరీని సైతం అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 131 ఓవర్లలో 378 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ బౌలింగ్ 40 బంతులు ఎదుర్కొని 25 పరుగులు చేసిన కేరీ.. ఐదు సార్లు ఔట్ కావడం విశేషం. కాసేపటికే మిచెల్ స్టార్క్‌ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చడంతో ఆస్ట్రేలియా 387 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.