భారత్ .. పాక్​ వన్డే  14 న 

భారత్ .. పాక్​ వన్డే  14 న 
  • అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్న సెలబ్రిటీలు 
  • మరి ఆ మ్యాచ్‌‌కి ఆ మాత్రం ఉండాలి

ముంబై :  భారత్, పాకిస్తాన్ జట్లు మైదానంలో తలపడుతున్నాయంటే ఆ ఇంటెన్సిటీనే వేరు. ఫ్యాన్స్ కూడా దాయాదుల పోరును ఏదో క్రికెట్ మ్యాచ్‌ కాకుండా.. అదేదో యుద్ధంలా ఫీల్ అయిపోతారు. ఇక ఆ మ్యాచ్ వరల్డ్ కప్ లాంటి అతి పెద్ద టోర్నీలో అయితే.. ఇంటెన్సిటీ రెండింతలవుతుంది. టెన్షన్ హైటెన్షన్‌గా మారుతుంది. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఎలాగైనా మ్యాచ్ గెలవాలని ప్రాణం పెట్టి ఆడతారు. పెద్ద పెద్ద స్టార్లు, సెలబ్రిటీలు సైతం ఈ మ్యాచ్‌ చూడడానికి క్యూ కడతారు. ఇప్పుడదే జరగబోతోంది.  వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం భారతీయ క్రికెట్ మండలి ఎన్నో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌కు ముందు కూడా రకరకాల ఈవెంట్లను ప్లాన్ చేసింది.   తాజా సమాచారం ప్రకారం.. 14 తేదీన జరగబోతున్న ఈ మ్యాచ్ చూసేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వస్తున్నారట. వీళ్లంతా శనివారం నాడు అహ్మదాబాద్‌ చేరుకుని స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూడబోతున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో అరిజిత్ సింగ్ కాన్సర్ట్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. మ్యాచ్ మొదలు కావడానికి ముందు అర్జిత్ సింగ్ రకరకాల బాలీవుడ్ హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడట.  ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే మ్యాచ్‌కి ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతుండడం, ఇక్కడ లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉండడంతో దాదాపు ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంతమంది ప్రేక్షకుల ఆకాంక్షలతో భారత్ కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఆశిద్దాం.