నైట్ రైడ‌ర్స్ సంచ‌ల‌న విజ‌యం..చివ‌రి బంతికి ల‌క్ష్యం చేరుకున్న కేకేఆర్

నైట్ రైడ‌ర్స్ సంచ‌ల‌న విజ‌యం..చివ‌రి బంతికి ల‌క్ష్యం చేరుకున్న కేకేఆర్

కోల్ క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యం సాధించింది. గుజ‌రాత్ జ‌ట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్  రింకు సింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. చివ‌రి ఓవ‌ర్లో 31 ప‌రుగులు చేశాడు. మెరుపులు మెరిపించాడు. వ‌రుస‌గా 5 సిక్స‌ర్లు బాదాడు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్ క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును గెలిపించాడు.  మొద‌టి బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 204 ప‌రుగులు చేసింది. 205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. చివ‌రి బంతికి ల‌క్ష్యం చేరుకుంది. రింకు సింగ్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.

 83 ప‌రుగులు చేసిన‌ వెంక‌టేశ్ అయ్య‌ర్

భారీ ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు మొద‌ట్లోనే షాక్ త‌గిలింది. 28 ప‌రుగుల‌కే 2 కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత వెంక‌టేశ్ అయ్య‌ర్ జ‌ట్టును గాడిలో పెట్టాడు. అద్భుతంగా ఆడాడు. 12 ఓవ‌ర్ నుంచి వెంక‌టేశ్ అయ్య‌ర్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లో 51 ప‌రుగులు పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత కూడా హిట్టింగ్ కొన‌సాగించాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదాడు. జ‌ట్టును ప‌టిష్ట స్థితికి తీసుకువ‌చ్చాడు. అయ్య‌ర్ జోరుకు అల్జ‌రీ జోసెఫ్ బ్రేక్ వేశాడు. జోరుమీదున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ ను 83 ప‌రుగుల వద్ద ఔట్ చేశాడు.. అల్జ‌రీ జోసెఫ్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన వెంక‌టేశ్ అయ్యర్ శుభ్మ‌న్ గిల్ క్యాచ్ ప‌ట్ట‌డం ద్వారా వెనుదిరిగాడు. ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర్లో ఉన్న స‌మ‌యంలో అయ్య‌ర్ ఔట‌వ్వ‌డంతో మ్యాచ్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది.

 నితీశ్ రానా జోరు

నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ నితీశ్ రానా అద‌ర‌గొట్టాడు. 29 బంతుల్లో45 ప‌రుగులు చేశాడు. 4 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్లు బాదాడు.  45 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు. 128 ప‌రుగుల వ‌ద్ద నితీశ్ రానా వెనుదిరిగాడు. అల్జ‌రీ జోసెఫ్ వేసిన బౌలింగ్ లో అభిన‌వ్ మ‌నోహ‌ర్ క్యాచ్ ప‌ట్డడం ద్వారా ఔట‌య్యాడు. నితీశ్ రానా ఔటైన త‌ర్వాత రింకు సింగ్ బ‌రిలో దిగాడు.

 రింకు సింగ్ 48 పరుగులు

రింకు సింగ్ బ‌రిలో దిగేస‌రికి గుజ‌రాత్ జ‌ట్టు ఆధిక్యంలో ఉంది. మ్యాచుపై ప‌ట్టు సాధించింది. ఆ స‌మ‌యంలో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని అంద‌రూ భావించారు. రింకు సింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మ్యాచ్ 19వ ఓవ‌ర్, 20 ఓవ‌ర్ల‌లో పిట్ట‌కొట్టుడు కొట్టాడు. ఓట‌మి అంచున ఉన్న జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. 19 వ ఓవ‌ర్ చివ‌రి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఫోరు కొట్టి 10 ప‌రుగులు పిండుకున్నాడు. 20వ ఓవ‌ర్ తొలి బంతిని ఎదుర్కొన్న ఉమేశ్ యాద‌వ్ సింగిల్ తీసి రింకు సింగ్ కు బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. చివ‌రి 5 బంతుల్లో 28 ప‌రుగులు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో రింకు సింగ్ చిచ్చ‌ర‌పిడుగువ‌లే చెల‌రేగి ఆడాడు. చివ‌రి 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు బాది జ‌ట్టుకు విజ‌యం అందించాడు. ఈ మ్యాచులో గుజ‌రాత్ జ‌ట్టు రెగ్యుల‌ర్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆడ‌లేదు. ర‌షీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు మోసాడు.  స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డంలో విఫ‌లం చెందాడు. జ‌ట్టుకు ఓట‌మి అందించాడు