ఆసియా క్రీడలు  

ఆసియా క్రీడలు  
  • టీమిండియాకు కోచ్‌గా  వీవీఎస్ లక్ష్మణ్‌ , 
  • మహిళా జట్టు కోచ్ గా కనిత్కర్​ నియామకం

ముంబై: భారత మాజీ బ్యాట్స్‌మెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆసియా గేమ్స్‌లో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా నియమించగా, మాజీ ఆల్ రౌండర్ హృషికేష్ కనిట్కర్ మహిళా జట్టు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. లక్ష్మణ్‌తో పాటు, భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే, ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలి ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. మహిళల జట్టులో కనిత్కర్‌తో పాటు రాజీబ్ దత్తా (బౌలింగ్ కోచ్), శుభదీప్ ఘోష్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు. ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగాల్సి ఉంది. అన్ని క్రికెట్ మ్యాచ్‌లు జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరుగుతాయి. హాంగ్‌జౌలోని జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని ఈ మైదానంలో ఆసియా క్రీడల క్రికెట్‌లోని అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత క్రికెట్ జట్టు తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొంటోంది. బీసీసీఐ పురుషుల, మహిళల రెండు విభాగాల్లోని ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది. టోర్నీలో ఇరు జట్లు క్వార్టర్ ఫైనల్‌గా తొలి మ్యాచ్ ఆడనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఈ విధంగా ఫైనల్‌కు చేరాలంటే ఇరు జట్లు వరుసగా 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఆసియా ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం మహిళల, పురుషుల విభాగాల్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాకు చెందిన టాప్-4 జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం రెండు భారత జట్లు ఆసియాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఆసియా క్రీడల్లో 18 జట్లు సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరుగుతాయి. అన్ని క్రికెట్ మ్యాచ్‌లు జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌లో జరుగుతాయి. మహిళల విభాగంలో 14 జట్లు, పురుషుల విభాగంలో 18 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఒక రోజులో 2 మ్యాచ్‌లు ఉంటాయి. మొదటి మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు, రెండో మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది. జూన్ 1, 2023 నాటికి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాలో టాప్-4 ర్యాంక్‌లో ఉన్న జట్లు నేరుగా క్వార్టర్-ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ గడువు ప్రకారం, మిగిలిన జట్ల ర్యాంకింగ్, మ్యాచ్‌లను కూడా నిర్ణయిస్తారు.