కళాశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు చేయుతనదించాలి 

కళాశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు చేయుతనదించాలి 
Jagityal MLA Sanjay Kumar

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్  డిగ్రీ కళాశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు ముందుకు  వచ్చి చేయుతనదించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్  డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ఎమ్మెల్యే  క్రీడా ప్రాంగణం ప్రారంభించి,7.60 లక్షలతో యువత, ఎన్ సిసి శిక్షణ కోర్సు గ్రౌండ్ నిర్మాణం కోసం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాస్కెట్ బాల్ కోర్టు కోసం 5 లక్షల నిదులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ ఉద్యోగార్థులు కోసం, నిరుద్యోగుల కోసం 33 లక్షలతో రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటం జరిగింది.

అదిలాబాద్, నిర్మల్ నుండి సైతం నిరుద్యోగుల ఇక్కడ రన్నింగ్ ట్రాక్ లో శిక్షణ తీసుకున్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలో 15 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, కమిషనర్ డా. నరేష్, ప్రిన్సిపల్ అశోక్, డిఈ రాజేశ్వర్, డిప్యూటీ డిఎం హెచ్ ఓ శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ నర్సయ్య, మొగిలి, ఓల్లెం మల్లేశం, దాయాల మల్లారెడ్డి, కూతురు శేకర్, ఏనుగుల నరేష్, శ్రీదర్ రావు, ఏనుగులరాజు, విద్యార్థులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.