విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం

విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం
  • మున్సిపల్ ఛైర్మన్ లయన్ మోర హన్మండ్లు

ముద్ర, రాయికల్ :-ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటుబుక్కులు అందించి ప్రోత్సహించడం అభినందనీయమని మున్సిపల్ ఛైర్మన్ లయన్ మోర హన్మండ్లు అన్నారు.శుక్రవారం రాయికల్పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్కులు అందించగా పంపిణీ చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యతోనేఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలోనే ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నారని ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిసీలు మ్యాకల రమేష్,కాటిపెల్లి రాంరెడ్డి,చౌడారపులక్ష్మీనారాయణ, అధ్యక్షులు ఎద్దండి దివాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి రంజిత్ కుమార్,కోశాధికారి కడకుంట్ల నరేష్,ఉపాధ్యక్షులు మచ్చ శేఖర్,లయన్స్ క్లబ్ సభ్యులు దాసరి గంగాధర్,గంట్యాల ప్రవీణ్,  కట్ల నర్సయ్య,కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.