ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టాలి.

ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టాలి.

జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి.

సారంగాపూర్ ముద్ర: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్ల దోపిడిని అరికట్టాలని జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలంలోని అర్పపెల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సారంగాపూర్ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రస్థాయి అధికారులు ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట గాని అధిక తూకం వేసిన చర్యలు తీసుకోబడునని హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామస్థాయిలో రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాలు అమలు చేయడం లేదని ఆరోపించారు.

ప్రతి ఒక్క బస్తా 40 కిలోలు జోకాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా 41 నుంచి 42 1/2 కిలోల వరకు వేస్తున్నారని అన్నారు. నిబంధన విరుద్ధంగా రైతుల నుండి అధిక తూకం వేసిన తరుగు పేరిట కట్ చేసిన రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టబడిన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్ , సారంగాపూర్ బీజేవైఎం మండల అధ్యక్షులు దీటి వెంకటేష్, బీజేవైఎం జిల్లా కోశాధికారి రంజిత్ రెడ్డి, స్థానిక రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు