గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్

మెట్‌పల్లి ముద్ర:- గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ కార్యక్రమాన్ని చేపట్టారని. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. సోమవారం మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల, మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామాల్లో క్రీడలను ప్రారంభించారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని.

క్రీడలలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా  దుస్తులు, క్రీడలకు కావాల్సిన వస్తువులను ఉచితంగా అందజేస్తుంది అని, క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేయనున్నట్లు  తెలిపారు. ఆయా మండలాల ఎంపీపీ లు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.