గ్రామీణ స్థాయిలో ప్రోత్సాహానికి సీఎం కప్

గ్రామీణ స్థాయిలో ప్రోత్సాహానికి సీఎం కప్

 తాటిపెల్లి గురుకులలో ప్రారంభించిన ఎమ్మెల్యే రవిశంకర్
ముద్ర, మల్యాల: గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. క్రీడా సంబరాల్లో భాగంగా మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  సీఎం కప్ మండల్ స్థాయి టోర్నమెంట్ ప్రారంభించారు. ముందుగా పరిచయ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే తర్వాత యువకులను ఉత్సాహ పరిచేందుకు కొద్ది సేపు వివిధ క్రీడలను ఆడారు. టోర్నమెంట్ లో పాల్గొనే వారందరికి క్రీడా కిట్స్, డ్రెస్సులు ఉచితంగా అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 

కాగా, ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే టోర్నమెంట్ లో కోకో, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ ఉంటాయని మండల స్థాయి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, జడ్పిటిసి కొండపలుకుల రామ్మోహన్రావు, సర్పంచులు బద్దం తిరుపతి రెడ్డి, రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసం శివ, కొండగట్టు డైరెక్టర్ జున్ను సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.