కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ ఎస్ లోకి వెళ్ళరని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలరా 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ ఎస్ లోకి వెళ్ళరని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలరా 
  • నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అధిస్టానం అదేశిస్తే ఎమ్మెల్యేగా పోటి చేస్తా 
  • మీడియా చిట్ చాట్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుండి వచ్చారని అలాగే కాంగ్రెస్ బిజెపి ఒకటేనని అన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలఫై స్పందిస్తూ కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాడని కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటేనని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించే వారు వ్యతిరేకంగా మాట్లాడతారని, కల్వకుంట్ల కుటుంబాన్ని బయటకు వస్తే రాళ్లతో, చెప్పులతో కొడుతారని పోలీసులు బందోబస్తు వస్తూన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బిఆరెస్ పార్టీలోకి వెళ్ళారని హామీ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగలడా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ అభివృద్ధి, నరేంద్రమోదీ బొమ్మ చూపించి ఓట్లు అడుగుతామని కులాలు పేరుతో అడగమని అన్నారు. 

అధిష్టానం పోటీ చేయమంటే బోధన్ నుండి జగిత్యాల వరకు  ఏడు నియోజక వర్గ లలో ఎక్కడైనా సిద్ధమేనని తెలిపారు. అలాగే కాంగ్రెస్ కు ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకడం లేదని బీజేపీ కు తీవ్ర పోటీ ఉందని, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు శిష్యుడుగా, కాంగ్రెస్ అధ్యక్షుడు గా కాదని ,  చంద్రబాబుకు తెలంగాణ లో ఎక్కడ ఓటు బ్యాంకు ఉంటే అక్కడే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని కొండగల్ లో గెలవని రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో ఎలా గెలుస్తారని ఒక ప్రశ్న కు సమాధానం చెప్పారు. చంద్రబాబునాయుడు ఎన్ డి ఎలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ డి ఎలోకి వస్తే రేవంత్ పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు.

కవిత అక్కను, బావ తో సహా అందరికి శిక్ష పడుతుందని తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం వస్తే మొదట లాభం జరిగేదే రైతులకే...ఇథనల్ తో రైతులకు చాలా లాభమన్నారు. ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తు అదనంగ లబ్ది చేకురుస్తామని అన్నారు.  కల్వకుంట్ల ఫ్యామిలీ కి భయపడి పరిశ్రమలు వస్తలేవన్నారు. ఖమ్మంలో పొంగులేటి కమిషన్ ల కొరకే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. అనంతరం టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి బిజెపిలో చేరిన  50 మంది  యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజేపి  జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ మదన్ మోహన్, నాయకులు డా. సైలేందర్ రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి, ఆముదరాజు, కొక్కు గంగాధర్  తదితరులు పాల్గొన్నారు.