జగిత్యాలలో ఘనంగా రంజాన్ వేడుకలు 

జగిత్యాలలో ఘనంగా రంజాన్ వేడుకలు 

ముస్లింలకు రంజాన్ శుభకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలో ముస్లింలు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్బంగా  జగిత్యాల పట్టణములో నూర్ మజీద్, ఈద్గా , జామా మజీద్, ఖిల్లాతో పాటు పలు మజీద్ లవద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జేవన్ రెడ్డి, మున్సిపల్ ఇంఛార్జి ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, మాజీ మునిసిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, బండ శంకర్ లు ముస్లింలను కలిసి  రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.