నవాబుపేట రిజర్వాయర్ నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారి బాధ్యత తీసుకోవాలి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 

నవాబుపేట రిజర్వాయర్ నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారి బాధ్యత తీసుకోవాలి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 

గుండాల జూలై 17 (ముద్ర న్యూస్): ఆలేరు నియోజకవర్గంలో గుండాల మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించే బాధ్యత నీటిపారుల శాఖ అధికారులు తీసుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని గుండాల మండలానికి శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతలో భాగంగా నవాబు పేట రిజర్వాయర్ నుండి గుండాల మండలం లోని ప్రతి గ్రామానికి నీరు అందించే బాధ్యత నాపై ఉందని దీనికి నీటి పారుదల శాఖ అధికారి సహకరించాలని అన్నారు. జనగాం జిల్లాలో ఉన్న రిజర్వాయర్ గుండా మండలంలో ఉన్న 20 గ్రామాలకు సంబంధించిన 40 వేల ఎకరాలకు మీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నవ పేట రిజర్వాయర్ నుండి గుండాల మండలం అనంతరం నుండి బండ కొత్తపెళ్లి  వరకు కాలువలు  పూర్తయినట్టు చూయిస్తున్న కాంట్రాక్టర్, నీటిపారుల శాఖ అధికారులు వర్షాకాలం ప్రారంభమైందని, నీళ్లు వచ్చే సమయం ఆసన్నమైంది మీరందరూ అందుబాటులో ఉండి ప్రతి గ్రామానికి సాగునీరు అందించే బాధ్యత మీపై ఉంటుందని అన్నారు. ఏ ఒక్క రైతన్న ఫిర్యాదు చేసిన మాకు నీళ్లు వస్తలేవు అంటే అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు  తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.