మూడు పంటల నినాదం బీఆర్ఎస్ అంటే మూడు గంటల కరెంటుతో కాంగ్రెస్ కుట్రలు

మూడు పంటల నినాదం బీఆర్ఎస్ అంటే మూడు గంటల కరెంటుతో కాంగ్రెస్ కుట్రలు

ఇల్లందకుంట : ముద్ర: కాంగ్రెస్ కరెంట్ కుట్రలు - బీఆర్ ఎస్ మూడు పంటల నినాదంతో ఇల్లందకుంట రైతు వేదికలో రైతులతో సమావేశం  నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్పు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరు రాత్రులంత కరెంట్ కోసం పడిగాపులు  గాసిన రోజులు చూసినం అసలు తెలంగాణ ఉద్యమమే కరెంట్ కోసం పుట్టింది రైతులను కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు 2001లో కరెంట్ కోసం ఉద్యమం ఎత్తుకున్నది కెసిఆర్ ఈ రోజు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుందే మన కెసిఆర్ రైతన్నలారా రేవంత్ రెడ్డి అన్నట్టు మూడు గంటల కరెంట్ కావాలో మత పిచ్చి లేపే బీజేపీ ప్రభుత్వం  కావాలో మూడు పంటల ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గానికి లక్ష 17 వేల ఎకరాలకు నిరందిస్తున్నామని రైతు భీమా రైతు బందు 24 ఉచిత కరెంట్ ఆసరా పెన్షన్, ఇతర పథకాలతో హుజురాబాద్ లో బిఆర్ఎస్ జెండా  ఎగురావేస్తామని రైతులను అవమానించేలా అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా చైర్పర్సన్ కనుమల విజయ గణపతి కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి ఎంపీటీసీలు దంసాని విజయ కుమార్ అయిలయ్య ఎక్కటి సంజీవరెడ్డి చిన్నరాయుడు సర్పంచులు పుట్టరాజు రఫీ ఖాన్ సరోజన నాగయ్య రైతుబంధు సమితి మండల గ్రామ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.