ఇల్లందకుంట లో చంద్రరధోత్సవం 

ఇల్లందకుంట లో చంద్రరధోత్సవం 

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం

ముద్ర, వీణవంక: అపర భద్రాద్రి గా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు గత పది రోజులుగా  అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది.గురువారం సాయంత్రం నుండి చంద్రరధోత్సవం(పెద్ద రథం)పైభక్తులకు శ్రీ స్వామి వార్లు దర్శనమివ్వడంతో శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది.మధ్యాహ్నాం 3 గంటల తరువాత తిరుమాడ వీధులలో  రథ ఊరేగింపు జరుగనున్నది.