ఓదార్పులు సరే.. పరిహారం ఎక్కడ

ఓదార్పులు సరే.. పరిహారం ఎక్కడ
  •  ఎకరానికి 35 వేలు చెల్లించాలి
  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కేంద్ర కమిటీ   సభ్యుడు అంబటి జోజి రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన కెసిఆర్ ఇప్పటివరకు రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. శుక్రవారం  కరీంనగర్ నగరంలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక కరీంనగర్ జిల్లాలోని 35వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంకి పరిమితైందని,  రైతులకు ఒక రూపాయి కూడా అకౌంట్లో జమ చేయలేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 35 వేల రూపాయలు నష్టపరిహారం  చెల్లించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
సొంత నియోజకవర్గమైన కరీంనగర్ లో వడ్లు కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమైండు అని కేంద్ర ప్రభుత్వం నుండి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగని ఆదుకోవాలని తక్షణమే రైతుల అకౌంట్లోకి 20వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి జమ చేయాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు అంబటి జోజి రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఉన్న సోయి సంత నియోజక వర్గం ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గం పైన నియోజవర్గం రైతుల పైన బండి సంజయ్ కి ప్రేమ లేదని అన్నారు.

ఓట్లు వేసిన పాపానికి కరీంనగర్ ప్రజలు తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేని పక్షాన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాలకు అంబటి జోజి రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.