తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఏసీపి వెంకట్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పారిశ్రామిక వాటి అనుబంధ రంగాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి రావాలంటే, శాంతి శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే ఏ పారిశ్రామికవేత్తలైన పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో మార్పులు వచ్చాయి. పల్లెల్లో రోడ్లు కమ్యూనికేషన్ లేక ఏదైనా నేరం జరిగితే పోలీసులు ఆలస్యంగా వచ్చేవారు.

నేడు ప్రభుత్వం ఏర్పడినంక 100కు డైల్ చేయగానే బ్లూ కోర్ట్ సత్వరమే స్పందించి సమస్య పరిష్కారం చేస్తున్నారు.2014 సంవత్సరానికి ముందు నాడు ఫ్రెండ్లీ పోలీస్ ఉండేది కాదు, ఫ్రెండ్లీ పోలీసు వల్ల నేడు సత్వర స్నేహపూరిత వాతావరణంలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. తెలంగాణ రాకముందు పోలీస్ స్టేషన్లో దీన వ్యవస్థలో ఉండేవి, పనిచేయని వాహనాలు ఉండేవి,నేడు టూ వీలర్ ,ఫోర్ వీలర్ వాహనాలను అందించింది,పోలీసులు సత్వరం స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా తోడ్పడుతున్నాయి. ఇంకా ఎన్నో విధాలుగా పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం సహకరించింది, అని తెలిపారు.