తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు

దగాపడ్డ తెలంగాణ దరిణిలో మెరిసిందిరా 
దశాబ్ధకాలంలోనే దశదిశలా కీర్తిరా 
కెసిర్ పాలనకు నిలువెత్తు సాక్షమై 
కాళేశ్వరం కట్టడం కనిపించె సత్యమై 

జైతెలంగాణ  ఇకలేదు హైరానా 
అభివృద్ధిమాగాణా అడుగడుగు నజరాన 

సిద్దించిన తెలంగాణ తొలివిజయం విద్యుత్తే 
చీకటైన తెలంగాణ ముప్పొద్దులా వెలుగులే 
కరెంటు కోతలను కనుమరుగు చేయించి 
ట్వంటీఫోరు ఇంటూసేవను వెన్నెల్లు పూహించే 

ఐపాస్ సృష్టితో పరిశ్రమలు పరుగులు 
పరిశ్రమలవృద్దికి క్రొంగొత్త మెరుగులు  
కాలుష్యరహిత పార్కు కనిపించే గొప్పగా   
ప్రగతిలోనే తెలంగాణ ప్రధమయ్యే ఇలలోన

ఫ్లయ్ఓవెర్ పరుగులు స్కైవేల నడకలు  
అందమైన రొడ్డులు అగుపించే హరితములు  
ప్రపంచమే అబ్బురపడి ప్రశంసలుకురిపించే 
స్వచ్ఛతెలంగాణమని అవార్డులె అందించే

బీడైన భూములకు పోంగొచ్చిన జలసింధు 
బక్కచిక్కిన రైతుకు బలమయ్యే రైతుబంధు
తెలంగాణ నేలంత బంగారు సిరులపంట 
తల్లడిల్లినతంగేడు తలుపుతూ మురిసేనంట  

అమరులత్యాగలకు నిరంతరం ప్రణమిల్లి  
ఆశయాల సాధనలో తెలంగాణ వర్థిల్లి 
దశాబ్ధి ఉత్సవమై జరగుతున్న సంబరాలు 
బంగారుతెలంగాణకు బలమైన బాటలు 

జైతెలంగాణ ఇకలేదు హైరాన 
అభివృద్ది మాగాణా అడుగడుగు నజరాన 

తెలంగాణ ఆవిర్బావ శుభాకాంక్షలు తెలుపుతూ ....
మీ వాకిటి రామ్ రెడ్డి (కవిగాయకుడు )
పులిగిల్ల ,వలిగొండ ,యాదాద్రిభువనగిరి 
చరవాణి : 9000702093