గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి... 

గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి... 
  • మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ లో శుక్రవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో గ్రంథాలయాల కార్యకలాపాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ గ్రంథాలయం అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దెకివ్వడం కోసం ప్రకటన ఇవ్వాలన్నారు .

జిల్లాలో 12 గ్రంథాలయాలు ఉండగా వాటిల్లో 8 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు సొంత భవనాల గ్రంథాలయాలకు అన్ని వసతులు సమకూర్చాలన్నారు. గ్రంధాలయాలు లేని చోట ఏర్పాటుకు, అదేవిధంగా గ్రంథాలయ ప్రాముఖ్యత ఉన్నచోట విస్తరణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో కమ్యూనిటీహాల్స్ గాని, పాఠశాల అదనభవనాలు గాని, దాతలు సమకూర్చిన భవనాలు కానీ గ్రంథాలయాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు . గ్రంథాలయాల బ్రాంచ్ అవసరాల మేరకు పుస్తకాల కొనుగోలుకు ఇతర అవసరాలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో రమాదేవి, మహబూబాబాద్, డోర్నకల్,తొర్రూరు, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు ప్రసన్న రాణి, శ్రీనివాస్, కుమార్,రాజు పంచాయతీ అధికారి దన్ సింగ్, ఇంజనీరింగ్ అధికారులు తానేశ్వర్, సురేష్, గ్రంథాలయ సెక్రటరీ శ్రీలత గ్రంథాలయ అసిస్టెంట్ వీరేందర్, ఈడియం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.