గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథ సేకరణ కార్యక్రమం..

గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథ సేకరణ కార్యక్రమం..
  • సమాజహితం కోసం పుస్తకాలను దానం చేయండి.. 
  • గుడిపుడి నవీన్ రావు., జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్.. 

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: మహబూ బాబాద్ జిల్లా గ్రంథాలయసంస్థ ఆద్వర్యంలో  ఈనెల 17వ తేది నుండి గ్రంథసేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని మేధావులు, పుస్తక ప్రియులు, రచయితలు, కవులు, కళాకారులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీలవాదులు, ప్రచురణకర్తలు, పుస్తకవిక్రేతలు, విద్యార్థినీ, విద్యార్ధులు, ఉపాధ్యాయులు,  ప్రభుత్వఅధికారులు, విద్యావంతులు సమాజహితం కోసం పుస్తకాలను విరాళంగా ఇవ్వాలని కోరారు. 

తమ వద్ద ఉన్న పుస్తకాలను ర్యాక్ లలో పరిమితం కాకుండా జిల్లాలో ఉన్న 14 గ్రంథాలయాలకు  పుస్తకదానం చేసి భావితరాలకు ఉపయోగపడాలని నవీన్ రావు కోరారు. ఎన్నో అమూల్యమైన, అద్బతమైన పుస్తకాలు   చిత్తుకాగితాలుగా మారి..  బజారులో మిఠాయి పొట్లాలు కట్టుకోవడమో, చిత్తు కాగితం క్రింద ఉపయోగించుకోవడమో, అమ్ముకోవడమో, చెత్తకుప్పలో పడవేయడం జరుగుతోందని, మరికొన్ని చోట్ల విలువైన పుస్తకాలు చెదలు పట్టి  పనికిరాని స్థితికి చేరుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ..పరిస్థితుల్లో మార్పు తేవాలని  విలువైన గ్రంథాలు, మంచి..మంచి పుస్తకాలు భవిష్యత్ తరాలకు మీ..గుర్తుగా అందజేసేందుకు  గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు నవీన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు విజ్ఞానాన్ని అందించే విలువైన పుస్తకాలు జిల్లాలో ఆయా గ్రంథాలయాలకు  బహూకరించి గ్రంథాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా వాసులను గుడిపుడి నవీన్ రావు కోరారు