పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్వంత జిల్లాలో సర్పంచ్ ల ఆవేదన...!!

పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్వంత జిల్లాలో సర్పంచ్ ల ఆవేదన...!!
  • నిధులు ఇవ్వండి.. లేదంటే పంచాయతీ పాలన కష్టమే..!!
  • ఇలా..అయితే మా..వల్లకాదు..!!
  • ఇయంఐలు కట్టె పరిస్థితి లేదు ట్రాక్టర్ లు వెనక్కి ఇచ్చేస్తాం..
  • యంపిడిఓకు విన్నవించిన సర్పంచ్ లు..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్:గ్రామ పంచాయతీలకు రావలసిన 15 ఫైనాన్స్, ఎస్ఎఫ్సి నిధులు వెంటనే విడుదల చేయాలని లేనట్లయితే పంచాయతీ పాలన కష్టమని మహబూబాబాద్ మండలానికి చెందిన పలువురు సర్పంచ్ లు మొరపెట్టుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వంత జిల్లాలో సర్పంచ్ లు గురువారం యంపిడిఓను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ట్రాక్టర్ ఈయంఐ వాయిదాలకు నిధులు లేకపోవడంతో వాయిదాలు కట్టలేక పోతున్నామని, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. మల్టీపర్పస్ వర్కర్స్ జీతాలు గత ఆరు నెలల నుండి ఇవ్వలేకపోతున్నామని తక్షణమే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ..మేరకు మహబూబాబాద్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు కి మండలంలోని సర్పంచ్ లు వినతి పత్రం సమర్పించారు. నిధులు విడుదల చేయనట్లయితే భవిష్యత్తులో గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఎంపీడీవోలకు అప్పచెప్తామని వారు హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్,

విఎస్ లక్ష్మీపురం సర్పంచ్

పరకాల వెంకన్న,

జరుపుల తండా సర్పంచ్

బాలాజీ,

మొట్లతండా సర్పంచ్

సుమన్,

సొమ్ల తండా సర్పంచ్ 

భూక్య బాలాజీ,

లక్ష్మీపురం తండ సర్పంచ్

భూక్యా సింధుభాస్కర్,

అయోధ్య సర్పంచ్ 

కోల సత్యం,

సాధుతండా సర్పంచ్ 

రమేష్,

గడ్డిగూడెం తండా సర్పంచ్

భూక్యా వస్రం,

వేమునూరు మేడి శారద,

అమనగల్ సర్పంచ్ 

పూజారి మంగమ్మ,

రేగడి తండా సర్పంచ్

లక్ష్మీరాంచందర్,

దర్గాతండ సర్పంచ్ బాలు తదితులున్నారు