గిరిజనుల జీవితాలను చింద్రం చేస్తున్న క్రషర్ మిల్లు

గిరిజనుల జీవితాలను చింద్రం చేస్తున్న క్రషర్ మిల్లు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాలో నిర్వహిస్తున్న క్రషర్ మిల్లు యాజమాన్యం విచ్చలవిడిగా బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల సమీప రైతులకు పంట నష్టం, ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు, నెల్లికుదురు పిఎసిఎస్ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం నల్లగుట్ట తండా జిపి పరిధిలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇండ్లకు చీలికలు వచ్చిన విషయంపై అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మైనింగ్ నిబంధనలు పాటించకుండా  ఇష్టం వచ్చినట్టు బ్లాస్టింగ్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా క్రషర్ మిల్లు నిర్వహణపై సమగ్రమైన విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్రషర్ బాధితులు బానోతు రమేష్, మాము, మీటియా, సోనా, మాలి, శ్రీరామ్, తోరియా, రామచంద్రు పాల్గొన్నారు.