శునకానికి కర్మకాండలు! పాతికవేలతో సమాధి నిర్మాణం

శునకానికి కర్మకాండలు! పాతికవేలతో సమాధి నిర్మాణం

కేసముద్రం, ముద్ర: అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృత్యువాత పడగా అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు దశదిన కర్మ నిర్వహించి పాతిక వేల రూపాయల ఖర్చుతో శునకానికి సమాధి నిర్మించిన చిత్రమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న మంజుల దంపతులు ఏడేళ్ల క్రితం జర్మన్ షెఫర్డ్ బ్రీడర్ రకానికి చెందిన శునకాన్ని తెచ్చుకొని ఆ క్షణకానికి జాకీ అని పేరు పెట్టుకుని శునకాన్ని సొంత పిల్లల మాదిరిగా అల్లారుముద్దుగా పెంచుకోగా పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీనితో కన్నీరు మున్నీరైన వీరన్న మంజుల దంపతులు శునకానికి మనుషులకు చేసిన విధంగానే అంత్యక్రియలు నిర్వహించి పదో రోజు దశదినకర్మలు నిర్వహించి పాతిక వేల రూపాయలతో సమాధి నిర్మించారు. తాము పెంచుకున్న శునకం జాకి ఫోటో ఆధారంగా సమాధిపై మరో ఆరువేల రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా శిలాఫలకం రూపొందించి ఏర్పాటు చేశారు. జాకీ దశదినకర్మ కార్యక్రమానికి బంధుమిత్రులను ఆహ్వానించి సమాధి వద్దకు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ విచిత్ర ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, శునకం విశ్వాసానికి, యజమానులు కృతజ్ఞత చాటారంటు నేటిజెన్లు అభినందనలు తెలుపుతున్నారు.